
ఉత్తరప్రదేశ్లో తన గర్భిణీ భార్యను హత్య చేసిన వ్యక్తిని, వారి ఐదేళ్ల బాలుడు ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు.
తల్లిని తండ్రే చంపాడని బాలుడు పోలీసులకు చెప్పడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాలుడి వాంగ్మూలాన్ని రికార్డు చేసి తదుపరి విచారణ చేపట్టారు.