
దేశీయ ఐటీ కంపెనీలలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవల గిరాకీ గణనీయంగా పెరుగుతోంది.
వచ్చే 2-3 ఏళ్లలో ఇన్ఫోసిస్ కంపెనీ ఆదాయంలో దాదాపు సగం వాటా ఏఐ సేవల నుంచే లభించవచ్చని సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు.
జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయంలో ఏఐ సేవల వాటా 8 శాతంగా నమోదైంది.