
సెమీకండక్టర్ తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తైవాన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.
ఇందుకోసం ఢిల్లీలో కేంద్రం నిర్వహిస్తున్న సెమీకాన్ ఇండియా-2026 సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ పాల్గొంటోంది.
ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ నేతృత్వంలోని బృందం ఈ సదస్సులో ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది.