
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో చాక్లెట్ ఆశచూపి మూడేళ్ల బాలుడు వేదాన్ష్‌ను గుర్తుతెలియని మహిళ కిడ్నాప్ చేసింది.
బాలుడి తండ్రి నరేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలితో పాటు ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
ఘటనపై స్పందించిన ఎస్‌హెచ్‌వో రఘుపతి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.