
ఆదిత్య బిర్లా గ్రూప్ 'అల్ట్రావోల్ట్' బ్రాండ్‌తో కేబుళ్లు, వైర్ల వ్యాపారంలోకి ప్రవేశించింది.
ఈ కొత్త బిజినెస్ కోసం గ్రూప్ రూ. 1,800 కోట్ల పెట్టుబడిని కేటాయించినట్లు చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు.
అల్యూమినియం, కాపర్ విభాగాల్లో తమకున్న నైపుణ్యం ఈ కొత్త వ్యాపార వృద్ధికి కీలకంగా మారుతుందని సంస్థ పేర్కొంది.