
మహిళల టీ20 ఆసియా కప్ 2026 టోర్నీని ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు యూఏఈ వేదికగా నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేసియా, థాయ్లాండ్, యూఏఈ జట్లు పాల్గొననుండగా, ఆగస్టు 27న అన్ని జట్లు యూఏఈకి చేరుకోవాల్సి ఉంటుంది.
గత ఎడిషన్లో ఫైనల్లో భారత్ ఓడిపోగా, ఇప్పటివరకు టీమిండియా ఏడు టైటిళ్లను గెలుచుకుని ఆసియా కప్లో అత్యధిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.