ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తినడం వల్ల లాలాజలం ఆహారంతో కలిసి జీర్ణక్రియ సులభతరం అవుతుందని హెల్త్‌లైన్ నివేదిక సూచిస్తోంది.
పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం రెండు గంటల గ్యాప్ పాటించడం మరియు ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.