
కృత్రిమ మేధ (ఏఐ) విభాగంలో ఖర్చుల నియంత్రణ కోసం ఒరాకిల్ సంస్థ భారీ లేఆఫ్స్‌కు సన్నద్ధమవుతోంది.
ఈ ఉద్యోగుల తొలగింపు వ్యూహం కోసం కంపెనీ సుమారు రూ.6,700 కోట్లను (700 మిలియన్ డాలర్లు) ప్రత్యేకంగా సిద్ధం చేసుకుంది.
డేటా సెంటర్ల నిర్మాణాలు, ఏఐ ప్రాజెక్ట్‌ల ఆర్థిక భారం కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.