
మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వం, ఆస్ట్రేలియాలోని విద్యా మరియు పారిశ్రామిక సంస్థల మధ్య నాలుగు కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
ఐఐటీ తిరుపతిలో సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో పాటు, ఆటిజం విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ, వర్చువల్ కౌన్సెలింగ్ సేవలను ప్రారంభించనున్నారు.
ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరియు డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్ కలిసి రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణను అందించనున్నాయి.