
శరీరానికి అవసరమైన విటమిన్ డి3ని సహజంగా పొందడానికి ఉదయం పూట లేత ఎండలో కాసేపు గడపడం మాత్రల కంటే ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సూర్యరశ్మి వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ విడుదలై రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా, సెరోటోనిన్ హార్మోన్ ద్వారా మంచి నిద్ర పడుతుందని నిపుణులు పేర్కొన్నారు.
తీవ్రమైన లోపం ఉన్నవారు లేదా వృద్ధులు మాత్రమే వైద్యుల సలహాతో సప్లిమెంట్లను వాడాలని, మిగిలిన వారు సహజ పద్ధతులకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.