
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సరైన వైద్య చికిత్స అందించాలని కోరుతూ 9 దేశాలకు చెందిన 21 మంది మాజీ కెప్టెన్లు షెబాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు.
సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్ వంటి భారతీయ దిగ్గజాలతో పాటు మైకేల్ ఆథర్టన్ ఈ లేఖపై సంతకాలు చేశారు.
అవినీతి ఆరోపణలతో 2023 నుంచి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు ఆస్పత్రికి తరలించినా, పరీక్షల అనంతరం తిరిగి అడియాలా జైలుకు తరలించారు.