
వరల్డ్ ఛాంపియన్స్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మూడో సీజన్ టోర్నమెంట్ నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు నిష్క్రమించింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ దేశ ఆటగాళ్లకు నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (NOCs) జారీ చేయడానికి నిరాకరించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 10న జరగాల్సిన హై-వోల్టేజ్ భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ అధికారికంగా రద్దయింది.