తెలంగాణలో 22-A నిషేధిత భూముల జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఉందని, దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు రెవెన్యూ శాఖలో 30 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారని హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ, అధికారుల తప్పిదాల వల్ల ప్రైవేటు భూములు జాబితాలో చేరాయని, సమస్య పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.