
అమెరికా కొత్త ఆర్థిక ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ సోమవారం రికార్డు స్థాయికి పడిపోయింది.
ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం ఒక అమెరికన్ డాలరుకు 20.2 లక్షల ఇరాన్ రియాళ్లుగా నమోదైంది.
గతంలో విధించిన ఆంక్షలకు తోడు అమెరికా తీసుకుంటున్న తాజా చర్యలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.