
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ క్లెమెంట్ టౌన్‌లో సెప్టెంబర్ 12న కౌశికీ ధ్యానితో పాటు పలువురి ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోరీకి గురయ్యాయి.
చోరీ జరిగిన నెల రోజుల తర్వాత బాధితురాలి ఐఫోన్ నుంచి దొంగ నేరుగా ఆమెకు మెసేజ్ చేసి ఫోన్ పాస్‌వర్డ్ ఏంటో త్వరగా చెప్పాలని అడిగాడు.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించగా, పోలీసులు దానిని ఖండించారు.