
రష్యా ఉపగ్రహాల ద్వారా సేకరించిన నిఘా సమాచారాన్ని ఇరాన్‌కు చేరవేస్తోందని, ఇది ప్రపంచ శాంతికి ముప్పు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు.
జూలై 19, 20 తేదీల్లో బహ్రెయిన్, జోర్డాన్, కువైట్‌లలోని నాలుగు కీలక అమెరికా వైమానిక స్థావరాలపై రష్యా శాటిలైట్లు నిఘా పెట్టినట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ గుర్తించింది.
ఈ రహస్య సైనిక సహకారాన్ని అడ్డుకోవడానికి తమ వద్ద ఉన్న ఆధారాలను భాగస్వామ్య దేశాలకు అందజేస్తామని జెలెన్‌స్కీ ప్రకటించారు.