
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 17 అర్ధరాత్రి 00:01 గంటల నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుంది.
ఈ కొత్త విమానాశ్రయం ప్రారంభంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లోని షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు ఉన్న 'VTZ' అంతర్జాతీయ ట్రావెల్ కోడ్ భోగాపురం విమానాశ్రయానికి బదిలీ కానుండగా, విశాఖలో కేవలం అత్యవసర, వీఐపీ విమానాలకు మాత్రమే అనుమతి ఉంటుంది.