
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే 24 గంటలు అత్యంత కీలకమని ఐఎండీ హెచ్చరించింది.
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, శ్రీశైలం డ్యామ్‌లోకి 85,421 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.
ప్రమాదకర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సహాయక చర్యల కోసం 12 కంపెనీల ఎస్డీఆర్ఎఫ్ మరియు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధంగా ఉంచారు.