
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బెంగాల్ వద్ద తీరాన్ని దాటడంతో, దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆగస్టు 13 నుండి 18 వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
గత 24 గంటల్లో కుమురం భీం జిల్లా ఎల్కపల్లిలో అత్యధికంగా 7.3 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, ఆగస్టు 13 నుండి 15 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.