
7 అవర్స్ టు గో, ది ఫైనల్ ఎగ్జిట్, తగ్గేదే లే వంటి చిత్రాల్లో నటించిన 27 ఏళ్ల నటి అనన్య రాజ్ జూలై 15న నిద్రలోనే కన్నుమూశారు.
గత ఏడాది కాలంగా శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్న అనన్య, వాటిని అధిగమించేందుకు యోధురాలిలా పోరాడిందని కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఆమె మరణవార్తను కుటుంబ సభ్యులు ఆగస్టు 16న ధృవీకరించగా, తోటి నటీనటులు ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.