
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్య, కర్ణాటక సంగీత గాయని శివశ్రీ స్కందప్రసాద్‌కు రైలు ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది.
56 సీట్ల కోచ్‌లో తోటి ప్రయాణికులు ఐదు గంటల పాటు పెద్దగా మాట్లాడుతూ, పాటలు పాడుతూ ఇబ్బంది పెట్టారని ఆమె ఎక్స్‌లో తెలిపారు.
టీటీఈ జోక్యంతో కొద్దిసేపు ఆటలు ఆపినప్పటికీ, ఆ తర్వాత వారు వ్యంగ్యంగా మాట్లాడటంతో పౌరస్పృహపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.