
కలాత్ సంస్థాన ప్రస్తుత ఖాన్ మీర్ సులేమాన్ దావూద్ ఖాన్ కుమారుడు, బలూచ్ యువరాజు ప్రిన్స్ మొహమ్మద్ ఖాన్ అహ్మద్జాయ్ అక్టోబర్ 26న కిడ్నాప్ అయ్యారు.
ఖుజ్దార్ నుండి కలాత్ నగరానికి హైవేపై ప్రయాణిస్తుండగా ముగ్గురు గన్మెన్లతో పాటు యువరాజును దుండగులు అపహరించారు.
పాక్ ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకోవడానికి లండన్ నుండి వచ్చిన ఆయనను కిడ్నాప్ చేసిన ఘటనపై క్వెట్టా పోలీస్ ప్రధాన కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది.