
గతేడాది నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఆత్మాహుతి దాడేనని ఎన్ఐఏ 7,500 పేజీల చార్జిషీటులో పేర్కొంది.
ఈ ఘటనలో 15 మంది మరణించగా, ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్నబీ ఐ20 కారులో ఐఈడీ బాంబును పేల్చినట్లు డీఎన్ఏ పరీక్షల్లో నిర్ధారణ అయింది.
అల్‌ఖైదా అనుబంధ సంస్థ 'అన్సార్ గజ్వత్ ఉల్ హింద్' మాడ్యూల్ సూత్రధారి అయిన నబీ, 2023 నుంచే ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది.