
యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయోకు చెందిన ప్రత్యేక ఎడిషన్‌ను కేవియర్ (Caviar) అనే సంస్థ ‘లిక్విడ్ మెటల్’ పేరుతో రూపొందించింది.
ఈ కస్టమ్ ఫోన్ తయారీలో సాధారణ మెటీరియల్స్‌కు బదులుగా అత్యంత ఖరీదైన 925 స్టెర్లింగ్ సిల్వర్‌ను ఉపయోగించి ద్రవరూప లోహపు డిజైన్‌ను తీర్చిదిద్దారు.
ప్రపంచవ్యాప్తంగా కేవలం 17 యూనిట్లను మాత్రమే తయారు చేయగా, దీని బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 18 లక్షలు ఉండగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 20 లక్షలకు పైగా పలుకుతోంది.