
సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
శుక్రవారం 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కాగా, శనివారం విప్ ఆది శ్రీనివాస్ నేతృత్వంలో మరో బృందం ప్రెస్ మీట్ పెట్టి సురేఖ తీరును తప్పుబట్టారు.
ఈ వివాదంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు.