
హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రవణ్ ఓ కేసులో సీజ్ చేసిన మొబైల్ ఫోన్ నుంచి రూ.1.70 లక్షలను కాజేశాడు.
బాధిత సొమ్మును తన బంధువుల ఖాతాలకు బదిలీ చేసుకున్న ఆ కానిస్టేబుల్, అదే కేసులో స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారాన్ని కూడా తాకట్టు పెట్టాడు.
దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.