
జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ప్రారంభంలో 5 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన అఫ్గానిస్థాన్ జట్టును అజ్మతుల్లా ఒమర్జాయ్ (116 పరుగులు, 50 బంతులు) ఆదుకున్నారు.
నెం.6 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఫుల్ మెంబర్ జట్ల తరఫున టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా ఒమర్జాయ్ ప్రపంచ రికార్డు సృష్టించారు.