
రెండు నెలల క్రితం అత్యాచార యత్నానికి గురై మూడో అంతస్తు నుంచి తోసివేయబడిన 12 ఏళ్ల బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు గుండెకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
జూన్ 6న జరిగిన ఈ ఘటనలో గౌస్‌పాషా అనే నిందితుడు బాలికను అపార్ట్‌మెంట్ పైనుంచి కిందకు తోసేశాడు.