
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిచ్పల్లి వ్యవసాయ కళాశాల నూతన భవన నిర్మాణ పనులకు భూమిపూజ జరిగింది.
ఈ భవన నిర్మాణాన్ని రూ.123 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు విశ్వవిద్యాలయ వీసీ అల్దాస్ జానయ్య వెల్లడించారు.
వ్యవసాయ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.