
మెగా డీఎస్సీ-2025లో 13 సబ్జెక్టులకు సంబంధించి 42,000 ప్రశ్నలతో కూడిన బ్యాంక్ ద్వారా జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు.
క్రీడా కోటాలో 421 పోస్టులకు 3,600 మంది దరఖాస్తు చేసుకోగా, 382 మందిని సర్టిఫికెట్ల ధ్రువీకరణ తర్వాత ఎంపిక చేశారు.
అక్టోబరులో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబరులో పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అన్సారియా ప్రకటించారు.