
ఆఫ్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించడమే నీట్ పేపర్ లీకేజీలకు ప్రధాన కారణమని కేంద్ర ఉన్నత విద్యాశాఖ మాజీ కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు.
ఈ పద్ధతి కొనసాగినంత కాలం లీకేజీలను అరికట్టడం సాధ్యం కాదని, ఆన్లైన్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు ఎన్టీఏను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
నీట్ పరీక్షపై ఇస్రో మాజీ ఛైర్మన్ రాధాకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయకపోవడమే ప్రస్తుత సమస్యలకు మూలమని ఆయన పేర్కొన్నారు.