
సోషల్ మీడియాలో 'రెంట్ ఆన్ బాయ్‌ఫ్రెండ్' పేరుతో ఆకర్షణీయమైన ఆఫర్లు చూపిస్తూ సైబర్ నేరగాళ్లు యువతులను మోసం చేస్తున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
కేటుగాళ్లు బుకింగ్, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో క్యూఆర్ కోడ్ల ద్వారా డబ్బులు వసూలు చేసి అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయవద్దని సూచించారు.
బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.