
విజయవాడ కృష్ణలంక రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడైన సీఐ, నలుగురు కానిస్టేబుళ్లు, హోంగార్డుతో సహా ఏడుగురిని అరెస్టు చేసి జైలుకు పంపామని కోర్టుకు వివరించారు.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌కు సంబంధించిన స్టేటస్ రిపోర్టును గురువారం ఉదయం 10.30 గంటలకల్లా సమర్పించాలని జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.