
ఇండియాలో 'ఈట్-ఇన్ బై మినిట్స్' పేరుతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించడానికి ఫ్లిప్‌కార్ట్ సన్నాహాలు చేస్తోంది.
బెంగళూరులో 8 వేల మంది ఉద్యోగులతో ఇంటర్నల్ టెస్ట్ నిర్వహించిన సంస్థ, అక్టోబర్ నెలాఖరుకు పబ్లిక్‌గా ఈ సేవలను తీసుకురావాలని ఆలోచిస్తోంది.
స్విగ్గీ, జొమాటో వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లతో పోటీపడేందుకు ఫ్లిప్‌కార్ట్ తన లాజిస్టిక్స్ విభాగమైన ఏకార్ట్ ద్వారా ప్రత్యేక డెలివరీ టీమ్‌ను ఉపయోగిస్తోంది.