
కర్ణాటకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థలు మరియు ఐటీ కంపెనీల యాజమాన్యాలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కన్నడిగులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ఐటీ ఉద్యోగాలను కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు.
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.