టీసీఎస్ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో C3A గ్రేడ్, అంతకంటే పై స్థాయి ఉద్యోగులకు క్వార్టర్లీ వేరియబుల్ అలవెన్స్ చెల్లించడం లేదని అంతర్గత మెమోలో వెల్లడించింది.
కంపెనీ అంతర్గత పనితీరు లక్ష్యాలను చేరుకోలేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సుదీప్ కున్నమ్మల్ తెలిపారు.
అయితే అర్హత కలిగిన జూనియర్ స్థాయి ఉద్యోగులకు మాత్రం యథావిధిగా 100 శాతం వేరియబుల్ పే చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు.