తెమడ రంగును బట్టి ఊపిరితిత్తుల ఆరోగ్య స్థితిని అంచనా వేయవచ్చని, పారదర్శక తెమడ సాధారణమని, తెల్లటి తెమడ వైరల్ ఇన్ఫెక్షన్‌ను సూచిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
తెమడ పసుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారడం అనేది శరీరంలోని తెల్ల రక్త కణాలు బ్యాక్టీరియాతో పోరాడుతున్నాయని చెప్పడానికి స్పష్టమైన సంకేతం.
ఆకుపచ్చ తెమడ కొన్ని రోజులకు పైగా ఉంటే అది నిమోనియా లేదా సైనసైటిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు నిదర్శనం కావచ్చు, కాబట్టి వెంటనే యాంటీబయోటిక్ చికిత్స తీసుకోవాలి.