హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త స్టీల్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు కొత్త కారిడార్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఈ వంతెన నిర్మాణం ద్వారా స్థానిక వాహనదారులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.