
బీఆర్ఎస్ నేతలు రోడ్లపై ఆందోళనలు చేయడం మానేసి, అసెంబ్లీకి వస్తే చర్చలకు సిద్ధమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని మార్చుకోకపోతే మరో పదేళ్ల పాటు ఆ పార్టీ నేతలు రోడ్లకే పరిమితం కావాల్సి వస్తుందని ఆయన విమర్శించారు.
ఇందిరా పార్కు వద్ద జరిగిన టీపీసీసీ మహాధర్నా సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీపై ఈ వ్యాఖ్యలు చేశారు.