
ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక సాంకేతిక రంగానికి కేంద్రంగా మార్చేందుకు అక్టోబర్ 3న విజయవాడలో పాన్ ఐఐటీ సదస్సు నిర్వహించనున్నారు.
విజయవాడలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కృత్రిమ మేధ, క్వాంటమ్ టెక్నాలజీ వంటి రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం.