
మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు భారత్‌లో నిర్వహించేందుకు ఐసీసీ బోర్డు ఆమోదం తెలిపింది.
ముంబై, వడోదర నగరాల్లో జరగనున్న ఈ టోర్నీలో జులై 6 నాటికి టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 6లో ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పాల్గొంటాయి.
శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యం కారణంగా ఆతిథ్య హక్కులను కోల్పోవడంతో, ఐసీసీ ప్రత్యామ్నాయంగా భారత్‌ను ఎంపిక చేసింది.