
భారత్‌లో సంపద కేవలం కొద్దిమంది కుటుంబాలకే పరిమితమవుతోందని '360 వన్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్ 2026' నివేదిక వెల్లడించింది.
దేశంలోని కేవలం 3,040 మంది వ్యక్తుల వద్దే రూ.104 లక్షల కోట్ల సంపద పోగుపడి ఉందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొంది.
ధనవంతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, సంపద అసమానతలు కొనసాగుతున్నాయని ఈ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.