
నిధుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
సీఎంను కలిస్తే కాంప్రమైజ్ అయ్యారని, కలవకపోతే గ్యాప్ ఉందని విమర్శించడం సరికాదని ఆయన మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను సీఎంను కలుస్తున్నానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.