రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 6.5 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఆగస్టు 5న ప్రకటించింది.
ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, వరుసగా నాలుగోసారి వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని గవర్నర్ తెలిపారు.
ఈ నిర్ణయంతో గృహ, వాహన రుణాల ఈఎంఐలు ప్రస్తుతానికి పెరగకుండా స్థిరంగా ఉంటాయని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొన్నారు.