
అనంతపురం జిల్లాలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను సుజ్లాన్ సంస్థ ఏర్పాటు చేయనుంది.
ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని, 2030 నాటికి అదనంగా 5 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచుతామని సంస్థ ప్రకటించింది.
మంత్రి నారా లోకేశ్ కణేకల్లు మండలం హులికెరలో సుజ్లాన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, కొత్త బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్‌ను ప్రారంభించారు.