
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, జైలులో ఆయనకు అందుతున్న వైద్య చికిత్సపై ఆస్ట్రేలియాకు చెందిన ఏడుగురు మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వోంగ్కు వారు లేఖ రాస్తూ పాక్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు.
అడియాలా జైలులో మగ్గుతున్న ఇమ్రాన్ ఖాన్కు సరైన వైద్యం అందడం లేదని, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు కూడా ఆంక్షలు ఉన్నాయని వారు వాపోయారు.