
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించడంతో పాటు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల సరుకులను ఒకేసారి పంపిణీ చేయనుంది.
హైదరాబాద్ జిల్లాలో 653 చౌక ధరల దుకాణాల ద్వారా 8,43,607 కార్డుదారులకు 59,602 మెట్రిక్ టన్నుల బియ్యం, 7,279 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపిణీ చేయనున్నారు.
లబ్ధిదారులు తమ సమీపంలోని రేషన్ షాపుల్లో ఈ-పోస్ యంత్రం ద్వారా ఉచితంగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచించారు.