
ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన తర్వాత తన సినిమాలను టార్గెట్ చేస్తూ వస్తున్న ట్రోలింగ్‌పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు.
ఎక్కడైనా నేరం జరిగినప్పుడు బాధితుల పట్ల సానుభూతి చూపాలని కోరారు తప్ప ప్రతిసారీ సినిమాలను బలి పశువు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు.
విషాధాన్ని అడ్డు పెట్టుకుని తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కొందరు ఈ ఘటనను వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.