
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో బుధవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు హర్యాన్వీ గాయకుడు అంకిత్ బాలియాన్‌ను 18 రౌండ్ల కాల్పులతో హత్య చేశారు.
యూట్యూబ్‌లో 3.66 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న అంకిత్, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని యోగి సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.