
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ అద్భుత బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన హసన్, రెండో ఇన్నింగ్స్‌లోనూ ట్రవిస్ హెడ్, జేక్ వెదర్లాండ్లను బౌల్డ్ చేసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలగా, బంగ్లాదేశ్ 426 పరుగులు చేసి 228 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.